రూ. 8,225 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇళ్లు
హైదరాబాద్,ఆగస్టు30 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రికార్డు స్థాయిలో 8225 కోట్ల రూపాయల వ్యయంతో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రధాన అంకం పూర్తయింది. మొత్తం లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు టెండర్లను పిలవడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
నూతన అద్యయాన్ని సృష్టించింది. బుధవారం మరో 31వేల 704 ఇళ్లకు టెండర్లను పిలవడం ద్వారా మొత్తం లక్ష ఇళ్లకు టెండర్లు పిలిచిన చరిత్రను సృష్టించింది. ఈ లక్ష ఇళ్లలో ఇళ్లు ప్రస్తుతం ఉన్న33 బస్తీలను ఖాళీ చేయించి తిరిగి కొత్త ఇళ్లను నిర్మించడం కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. కేవలం అతి తక్కువ వ్యవధిలోనే లక్ష ఇళ్లకు టెండర్లు పిలవడం కూడా ఒక ప్రత్యేకత. ప్రధానంగా ప్రస్తుతం నివాసం ఉంటున్న బస్తీల నుండి నివాసితులను ఖాళీ చేయించి అక్కడ ఉన్న పాత ఇళ్లను తొలగించి తిరిగి కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టడం సవాలుతో కూడుకున్నది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ల ప్రత్యేక పర్యవేక్షణలో కమిషనర్ జనార్ధన్ రెడ్డి మొత్తం 33 బస్తీలకు చెందిన నివాసితులను ఖాళీ చేయించి డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడంలో విజయవంతమయ్యారు. ఈ బస్తీల్లో కొందరికి 30 గజాలు, మరికొందరికి 150 గజాల వరకు స్థలం ఉన్నవారు ఉన్నారు. ఎక్కువ స్థలం ఉన్నవారు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు నిరాకరించడం, కొందరు కోర్టును ఆశ్రయించడంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే ప్రత్యేక స్వచ్ఛ సంస్థలను నియమించి వీరందరిని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ఒప్పించడంలో జీహెచ్‌ఎంసీ విజయవంతమైందని అధికారులు తెలిపారు. ఇక లక్ష ఇళ్ల నిర్మాణానికి 109 ప్రాంతాల్లో కావాల్సిన భూమిని జీహెచ్‌ఎంసికి బదలాయించడానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, భూముల విషయాన్ని పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్లు, డిఆర్‌ఓలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ నిరంతరం సవిూక్షించారు.
దీపావళి నుంచి డబుల్ బెడ్‌రూమ్ కాలనీల గృహ ప్రవేశాలు
దీపావళి పండుగ నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్‌ఖ్తె దశలవారిగా గృహప్రదేశాలు జరగనున్నాయి. ప్రధానంగా నాచారంలోని సింగంచెరువు తండాలో నిర్మిస్తున్న 196 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి కానున్నాయి. దీని అనంతరం మన్సూరాబాద్ ఎరుకల నాంచారమ్మ బస్తీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు కూడా పూర్తి కానుంది.




