Friday, 6 November 2026

బసవతారక హాస్పిటల్ అవరణంలో మహా అన్నదానం ప్రారంభం

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 12

అల్వాల్ పట్టణ కేంద్రంలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కనజిగూడ లో వెలసిన అరుదైన అత్యంత విశిష్టమైన మరకతంతో మలచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినఆలయవ్యవస్థాపకులుకార్యనిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి అన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ దాదాపు రెండు సంవత్సరముల నుండి నిర్వాధికంగా అన్న ప్రసాద వితరణగా విస్తున్న ఏకైక దేవాలయం మరకత లక్ష్మీ గణపతి దేవాలయంఈనెల 16వ తారీకు నుండి బసవతారక హాస్పిటల్ ఆవరణలో అన్న ప్రసాద వితరణ హైకోర్టు జడ్జి తో ప్రారంభం అవుతుందని తెలిపారు నిరాటంకంగా అన్న ప్రసాదము జరగాలంటే దాతల ఆవశ్యకత ఉందని ముందుకు రావాలని ఆయన కోరారు. బోయినపల్లికి చెందిన స్రవంత్ రెడ్డి అన్న ప్రసాద వితరణకు ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలుఅన్నదాన ట్రస్ట్ కు అందజేశారు. వారికి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.