బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆపితే కేసులు నమోదు. ఎస్ఐ పరమేష్.

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్: ఆర్టీసీ బస్సులు అయినా సరే నిర్దేశించిన ప్రదేశాల్లో కాకుండా ఎక్కడపడితే అక్కడ ఆపి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్న డ్రైవర్ల పై కేసులు నమోదు చేస్తామని నేరేడుచర్ల ఎస్సై పీ.పరమేష్ అన్నారు. సూర్యాపేట, కోదాడ ఆర్టీసీ డిపోల నుండి నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడ వైపు వెళుతున్న బస్సులు
సోమవారం నేరేడుచర్ల పట్టణంలో మిర్యాలగూడ బస్ స్టాప్ వద్ద కాకుండా వేరొక చోట బస్సును నిలిపిన డ్రైవర్లు. బస్టాప్ వద్ద కాకుండా వేరే చోట నిలపడంతో బస్ డ్రైవర్లని స్టేషన్ కు తరలించిన ఎస్సై పరమేష్ సంబంధిత డిపో మేనేజర్లతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇటువంటి వి పునరావృతం కాకుండా చూస్తాము అని ఇచ్చిన హామీ మేరకు కేసు నమోదు చేయడం లేదని మరొకసారి ఇలాంటివి రిపీట్ అయితే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందరూ సహకరించాలని
ట్రాఫిక్ సమస్యలు సృష్టించ వద్దు అని అన్నారు.

తాజావార్తలు