రానున్న తాలూకా అసెంబ్లీ ఎలక్షన్లో బరిలో ఉంటా..!
కిరణ్ ఫౌండేషన్ చైర్మన్
-డాక్టర్.కిరణ్ కొమ్రేవార్.
భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు 01
ప్రత్యక్ష రాజకీయాల్లో రానున్న ఎలక్షన్ లో బరిలో ఉంటానని కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం బైంసా పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాజ సేవలో ముందున్న తాను రానున్న ఎలక్షన్ లో ప్రత్యక్ష రాజకీయాల వైపు ఉండి ప్రజలకు సేవ చేస్తాననీ పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు ఫలితాలు అందేలా చూస్తానన్నారు. ఇటీవల సిరాల ప్రాజెక్టు తెగి వందల ఎకరాలలో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొన్నారు. ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనాలని పలు రాజకీయ పార్టీలు సైతం ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు.త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహిత వర్గాలతో చర్చలు జరిపి ప్రకటిస్తానని తెలిపారు.