బస్ డిపో కొరకై మా పోరాటం ఫలించింది – ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నవరం రవికాంత్
ములుగు,జూలై18(జనం సాక్షి):-
జిల్లా లో బస్ డిపో ఏర్పాటు చేయాలనే మా ఆస్క్ ఫౌండేషన్ పోరాటం ఫలించిందని ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నవరం రవికాంత్ అన్నారు. ములుగు జిల్లాలో బస్ డిపో ఏర్పాటుకై ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమని ఆయన అన్నారు.ములుగు లో ఆస్క్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఆర్టిసి ఎండి సజ్జనార్ కి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి, బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అని, దశాబ్దాల కల మా ములుగు జిల్లా కి బస్ డిపో అని ఇన్నేళ్లకు మన ములుగు జిల్లా లో బస్ డిపో కొరకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం సంతోషకరం అని, ఆయన కి మా ఆస్క్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని ఆయన తెలిపారు…ఈ కార్యక్రమంలో కత్తెరపల్లి భాస్కర్,రుద్రోజు ఆనందచారి,తాటిపల్లి శశికాంత్,రాజ మనోహర్ రెడ్డి,శివ,గురు మరియు ఆస్క్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు..
Attachments area