Tuesday, 3 November 2026

బహిరంగ విచారణ వాయిదాకు నేతల పట్టు

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఫ్యాప్సీ భవన్‌లో చేపట్టిన బహిరంగ విచారణలో నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి విచారణ ప్రారంభం కాగానే తెదేపా, తెరాస, వామపక్ష నేతలు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన కోనసాగించారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై అధికారులను నిలదీశారు. ఈఆర్‌సీ ఛైర్మన్‌, సభ్యులను అడ్డుకునేందుకు యత్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *