Tuesday, 3 November 2026

బహిరంగ సభను జయప్రదం చేయాలని గోడపత్రికలు ఆవిష్కరణ

టేకులపల్లి, అక్టోబర్ ( జనం సాక్షి ): మతోన్మాద బిజెపి ఆర్ఎస్ఎస్,ప్రభుత్వాలు తీసుకువచ్చిన అటవీ సంరక్షణ నియమాలు-2022ను వ్యతిరేకిస్తూ ఈనెల 14వ తేదీన గుండాల మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలి సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభను ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం టేకులపల్లి సెంటర్లో ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఎట్టి నరసింహారావు, నాయకులు సజ్జ, సకృ,అమ్ములు, సక్రి, సోని తదితరులు పాల్గొన్నారు.