బహుజన పాలకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నెరవేరుస్తాం – బిఎస్పీ…

నాగర్ కర్నూల్ ఆర్సీ ఆగస్టు18(జనంసాక్షి):బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ)ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో బహుజన రాజ్య స్థాపకుడు,పాలకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా ఎంపీడీఓ ఆఫీస్ నుంచి నాగనూల్ చౌరస్తా వరకు,నాగనూల్ చౌరస్తా నుంచి డా.అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.తదనంతరం డా.అంబేద్కర్ విగ్రహం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ,బిఎస్పీ పార్టీ సీఎం అభ్యర్థి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బహుజన పాలకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.గోల్కొండ ఖిల్లాపై బహుజనుల రాజ్యాన్ని గొప్పగా నడిపిన రాజు సర్దార్ పాపన్న అని కొనియాడారు.అదే విధంగా నాగర్ కర్నూలు గడ్డమీద సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో బహుజన రాజ్యస్థాపన చేస్తామని పేర్కొన్నారు.గతంలో నాగర్ కర్నూలుకు బహుజన బిడ్డలు మహేంద్రనాథ్,విన్ గౌడ్, మోహన్ గౌడ్ లు ఎమ్మేల్యే లుగా పనిచేశారని అన్నారు.అదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో బిఎస్పీ పార్టీ బహుజన మహనీయుల ఆశయాలను గడప గడపకు చేరుస్తుందని తెలిపారు.నాగర్ కర్నూల్ అసెంబ్లీపై 10వేల ఓట్లున్న వారి ఆధిపత్యం ఇక ఎంత మాత్రం చెల్లనివ్వమని చెప్పారు.2లక్షల20వేల ఓట్లున్న బహుజనుల రాజ్యం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పట్టణంలో ఇంటింటికీ బిఎస్పీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ,జిల్లా ఇంచార్జ్ లు బిసమోళ్ల యోసేఫ్,అంతటి.నాగన్న,జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్,ప్రధాన కార్యదర్శి బోనాసి.రాంచందర్,అసెంబ్లీ ఇంచార్జ్ మోహన్ రెడ్డి,అధ్యక్షులు మహేష్ యాదవ్,ప్రధాన కార్యదర్శి కళ్యాణ్,ఉపాధ్యక్షులు పరుశరామ్,కోశాధికారి ఆనంద్,తదితరులు పాల్గొన్నారు.