హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో సైకిల్‌బాంబు పేలిన ప్రదేశాలను పోలీసులు ఇవాళ మార్కింగ్ చేశారు. ఘటనకు సంబంధించి సాధారణ దర్యాప్తులో భాగంగా కోణార్క్, వెంకటాద్రి సినిమాహాళ్ల సమీపంలోని ఎ -1 మిర్చి సెంటర్, 72 బస్టాప్‌ల వద్ద సున్నంతో మార్కింగ్ చేశారు. సైకిల్ బాంబుల పేలుళ్లలో ధ్వంసమైన వాహనాల సంఖ్యలను సూచిస్తూ నెంబర్లు వేశారు. మరోవైపు పేలుడు తీవ్రతకు వంద మీటర్ల పరిధిలో దెబ్బతిన్న హోర్డింగ్‌లు, దుకాణాల అద్దాలకు సంబంధించిన వివరాల్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశాల్లో శకలాలు తొలగించి శుభ్రం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ అనుమతి కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.




