Wednesday, 4 November 2026

బాక్స్ డ్రైన్స్ పనులకు శంకుస్థాపనచేసిన :సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్ (జనం సాక్షి )  లింగోజిగూడా డివిజన్ పరిధిలోని అల్తాఫ్ నగర్ నందు దాదాపు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించదలచిన బాక్స్ డ్రైన్స్ పనులు మరియు వడ్డెర బస్తి దగ్గర కల్వర్టు పనులకు   ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని  కార్పొరేటర్ .రాజశేఖర్ , మాజీ కార్పొరేటర్ .ముద్రబోయిన శ్రీనివాసరావు తో కలిసి శంకుస్థాపనచేశారు .ఈకార్యక్రమంలో  నాయకులు  మామిడి జగన్నాథ్ రెడ్డి , గంగపుత్ర భాస్కర్  ,వరప్రసాద్ రెడ్డి  , తిలక్రావు  ,  మల్లారపు శ్రీనివాస్  , బొంబాయి  ,పార్శపు శ్రీధర్,   డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు,డివిజన్ కమిటీ సభ్యులు,ఉద్యమకారులు,మహిళలు,పార్టీ అభిమానులు,బస్తివాసులు పాల్గొన్నారు.