|
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) లింగోజిగూడా డివిజన్ పరిధిలోని అల్తాఫ్ నగర్ డివిజన్ పరిధిలోని బస్తివాసులు తమ కాలనీ బస్తిలో నూతనంగా ప్రారంభించే బాక్స్ డ్రైన్స్ పనుల్లో పలు అనుమానాల మీద ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ని కలవడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..ఇట్టి బాక్స్ డ్రైన్స్ పనుల విషయంలో ఎవరు ఎలాంటి అనుమానాలు చెందాల్సిన అవసరం లేదని అన్నారు.ఇట్టి బాక్స్ డ్రైన్స్ నిర్మాణంలో ఎవరి ఇంటికి నష్టం కాకుండా పక్క ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని అన్నారు.ఇట్టి పనుల్లో కొన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అని తెలిపారు.ఇట్టి పనులు పూర్తి అయితే రాబోయే రోజుల్లో బస్తివాసులకు ఎలాంటి ముంపు సమస్యలు ఉండవని తెలిపారు.నా మీద నమ్మకం ఉంచి అట్టి బాక్స్ డ్రైన్స్ పనుల విషయంలో అధికారులకు పూర్తి సహాయ,సహకారాలు అందించాలని కోరారు.మీ యొక్క అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని మళ్ళీ అట్టి ప్రదేశంలో అధికారులచే పర్యటించి సాధ్యమైనంత నష్టం జరగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు.ఇట్టి బాక్స్ డ్రైన్స్ పనుల్లో బస్తివాసులకు జరుగుతున్న అసౌకర్యానికి మన్నించవలసిందిగా కోరారు.ఇట్టి కార్యక్రమంలో లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు,డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి,రాకేశ్ ఠాగూర్,వెంకట్ రెడ్డి,జనార్దన్ రెడ్డి మరియు బస్తీవాసులు పాల్గొన్నారు.
|
బాక్స్ డ్రైన్స్ పనుల విషయంలో అధికారులకు పూర్తి సహాయ,సహకారాలు అందించా




