బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్*

(జనంసాక్షి):  మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలోని కట్ట మైసమ్మ దేవాలయ సమీపంలో బాక్స్ డ్రైన్  నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు సౌకర్యార్థకంగా అందుబాటులోకి  తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, డీఈ రూప, ఏఈ రాకేశ్, వర్క్ ఇనస్పెక్టర్ చారి తదితరులు పాల్గొన్నారు