జులై 15 (జనంసాక్షి ) సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కెసిఆర్ సీఎం సహాయ నిధి నుంచి, నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం ఏడాకుల పల్లి, న్యాలకల్ మండలం లోని హద్నుర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేయించడం జరిగింది. ఇద్దరికి 60 వేల చొప్పున 1 లక్ష 20 వేయులు రూపాయలు చేయించడం జరిగింది అని తెలిపారు.. ఈ యొక్క చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడాకుల పల్లి.వార్డు మెంబెర్ శంకర్ యాదవ్ సోషల్ మీడియా జహీరాబాద్ ఇంచార్జ్ రవి కుమార్, తెరాస యూత్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ ,లక్ష్మన్న.న్యాలకల్ మండల తెరాస ప్రధాన కార్యదర్శి రాజు కుమార్ నాయకులు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం




