బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి-కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 28. (జనంసాక్షి). ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని ముష్టిపల్లి రాజీవ్ నగర్ లో ఉన్న ఈదుల చెరువు బాధిత కుటుంబాలను సంగీతం పరామర్శించారు. బాధితులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అధికారుల ముందు చూపు కోరవరడం వల్లే బాధితులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో బైపాస్ సమీపంలో నిర్మించిన కల్వర్టులను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే వరద వల్ల నష్టపోయిన ఈదుల చెరువు బాధితులకు తక్షణం సహాయం అందించాలని కోరారు. ఆయన వెంట పలువురు స్థానిక నాయకులు ఉన్నారు.