బాధిత కుటుంబానికి అండగా ధ్యాప నిఖిల్ రెడ్డి..

ఊరుకొండ, సెప్టెంబర్ 17 (జనం సాక్షి):
మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చిన ఆపద్బాంధవుడు గా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి ఆదుకుంటున్నాడని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి అంజయ్య(55) అనారోగ్యంతో మరణించారు. స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు ఈ విషాదం వార్తను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డికి తెలియజేశారు. ఈ విషాద వార్తను విన్న ధ్యాప నిఖిల్ రెడ్డి .. నిఖిలన్న యువసేన పేరిట తక్షణమే ఆర్థిక సహాయంగా రూ.5000/- సహాయంగా అందజేశారు. ఈ నగదును కాంగ్రెస్ నాయకులు, యువసేన సభ్యులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంగారెడ్డి, సీనియర్ నాయకులు దేవయ్య, కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు కంఠం విజయడు, వార్డ్ నెంబర్ వాల్మీకి రవి, మాజీ ఉపసర్పంచ్ యాదయ్య, సేవాదళ్ అధ్యక్షుడు గణేష్, కుమ్మరి కృష్ణయ్య, కుమ్మరి బాలస్వామి, ,కుమ్మరి రాములు, డి.ఎన్.ఆర్ యువసేన సభ్యులు దార రాజు, దార గోపాల్, ఆదినారాయణ, ప్రభు తేజ, దయాకర్, అరుణ్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.