వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది..
55వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు.
– కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్ రెడ్డి.
ఊరుకొండ, సెప్టెంబర్ 17 (జనం సాక్షి):
వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు వీఆర్ఏల నిరసన దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని..బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని
కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్ రెడ్డి, అడ్వకేట్ ఉమ్మడి జిల్లా సెక్రటరీ సుభాష్ మాదిగ లు ఆన్నారు. శనివారం 55వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా వారు పూర్తి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ.. వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ. సత్తయ్య, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ డీ.శ్రీలత, కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, నాగమణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు.