Tuesday, 3 November 2026

బాధిత కుటుంబానికి జడ్పీటీసీ ఆర్ధిక సహాయం

ట జూలై 14 జనంసాక్షి : మండల వ్యాప్తంగా ఎవ్వరికీ ఏమైనా ఆ కుటుంబాలకు నేనున్నాననే భరోసా శివ్వంపేట జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా కల్పిస్తూ, ఆ బాధిత కుటుంబాలను అన్నీ విధాలా ఆదుకుంటున్నారు. అందులో భాగంగానే మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికి చెందిన కమ్మరి ఈశ్వర్ ఇటీవల మరణించారు. ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో  జడ్పీటీసి పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధుల నుంచి 5 వేల రూపాయల నగదు అలాగే నిత్యవసర సరుకులు స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారి ద్వారా కమ్మరి లావణ్యకు గురువారం పంపించారు. ఈ కార్యక్రమం లో  ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, వార్డు సభ్యులు పోచ గౌడ్, కొండల్, పoబాల సంతోష్, సింహం, ఇసుగారి శ్రీను, కొవ్వూరి వెంకటేష్, బిజిలిపురం కృష్ణ, కారోబార్ గౌరీశంకర్, నాయకులు దావూద్ తదితరులు ఉన్నారు.