బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రణం
దౌల్తాబాద్ ఆగష్టు 26, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండలంలోని మాచిన్ పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి సంబంధించిన కమ్మరి పెంటయ్య గురువారం సాయంత్రం చనిపోయారు . ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఆ కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చి ఆ గ్రామ సర్పంచ్ బొక్కల యాదమ్మ సహకారంతో ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలకు సహాయం చేయడం జీవితంలో సంతృప్తినిచ్చే అంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూషణం, పిఎసిఎస్ డైరెక్టర్ రామచంద్ర గౌడ్, టిఆర్ఎస్ నాయకులు బొక్కల నాగరాజు, లక్ష్మయ్య, శెకరప్ప ,చేరిల్లా నాగరాజు, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.