బాధిత కుటుంబాలను పరామర్శించిన రితిక్ రెడ్డి
చౌడాపూర్,అక్టోబర్ 18( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కన్మాన్ కాల్వ మరియు బంగారం పల్లి గ్రామాలలో మరణించిన బాధిత కుటుంబాలను పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తనయుడు కాంగ్రెస్ యువ నాయకుడు రితిక్ రెడ్డి పరామర్శించి బంగారం పల్లి గ్రామంలో నడుమిమోని బుచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి రూ. 5 వేయిలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్,పరిగి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్,రామకృష్ణారెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాసయ్య,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్నయ్య,బంగారం పల్లి కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,అమర్నాథ్ రెడ్డి,రమేష్ మరియు చౌడాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.