*బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల ఆగస్టు30( జనంసాక్షి) ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పరామర్శించి సంతాపం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన తెరాస యువజన నాయకుడు కట్కూరి రాజేందర్ తండ్రి కొమురయ్య మృతి చెందగా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఇటీవల గుర్రపు రాజమ్మ మృతి చెందగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట జెడ్పిటిసి గొర్రె సాగర్, తెరాస మండల అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య, యూత్ మండల అధ్యక్షులు నవీన్, కట్కూరి నరేందర్ ,మడికొండ రవీందర్రావు, పిట్ట సురేష్ బాబు, పెరుమండ్ల రవీందర్,చేరి రవీందర్, గుర్రపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు