మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాలి.

పినపాక నియోజకవర్గం ఆగష్టు 30 (జనం సాక్షి):మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలకు మంచినీరుని ట్యాంకర్ల ద్వారా అందించాలని సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుగ్యాల సుధాకర్ మండల కార్యదర్శి జంగం మోహన్ రావు లు డిమాండ్ చేశారు.మంగళవారం పలు గ్రామాలను సందర్శించిన వారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా మంచినీరు రావడంలేదని, దీనివల్ల తాగడానికి మంచినీరు లేక, గ్రామాల్లో అనేకమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రేపటి నుంచి వినాయక చవితి పండగ ఉత్సవాలు ప్రారంభం కావడంతో మహిళలు మంచినీరు లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. గోదావరి దగ్గర ఉన్నటువంటి బురదతో కూడుకున్నటువంటి బావులను త్వరగా మరమ్మతులు చేయించాలని,. ప్రజలకు తాగునీరు త్వరగా అందేలా యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలకు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి అందించాలని వారు డిమాండ్ చేశారు.మంచినీటితోపాటు గ్రామాలలో గణేష్ ఉత్సవాల సందర్భంగా వీధి స్తంభాలకు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి సిహెచ్ దశరథం ఎస్కే సర్వర్,ఏఐటీయూసీ మండల అధ్యక్షులు తోట రమేష్ ,రావుల రాములు, రాయల బిక్షం, ఎస్ వి నాయుడు ,పరాల మల్లయ్య, జక్కుల రాజబాబు శ్రీకాకుళం వీరమల్లు కన్నెబోయిన ప్రసాద్ ఆదరణ రాములు ఉమర్ తదితరులు పాల్గొన్నారు.