రామగుండం,సెప్టెంబర్29(జనంసాక్షి): పోలీస్ కవిూషనర్‌గా ఐపిఎస్ అధికారి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పోలీస్ కవిూషనర్ ను కలిసి పుష్ప గుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని పకడ్బందిగా అమలు చేస్తామన్నారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. నేరాలకు పాల్పడితే ఎవరిని వదిలేది లేదన్నారు. అదే క్రమంలో సామన్యుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని అన్నారు.




