అచ్చంపేటలో కార్డెన్ సెర్చ్
నాగర్‌కర్నూల్,సెప్టెంబర్29(జనంసాక్షి): అచ్చంపేట పట్టణంలోని టంగాపూర్ కాలనిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. దాదాపు 150 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 బైకులు, ఒక ఆటో, ముగ్గురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.