Tuesday, 3 November 2026

బానోతు సుజాత నాయక్ తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాలి

హస్తినాపురం డివిజన్  బిజెపి  అధ్యక్షులు నరేష్ యాదవ్
  ఎల్బీనగర్ (జనం సాక్షి )   పార్టీ మారిన కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి మళ్ళీ తెరాస  పార్టీ తరపున పోటీ చేయాలని  హస్తినాపురం డివిజన్  బిజెపి  అధ్యక్షులు  నరేష్ యాదవ్ డిమాండ్ చేశారు .   బుధవారం  హస్తినాపురం లోని ఇంద్రప్రస్త కమ్యూనిటిహల్  గేట్ బయట     భారతీయ జనతా పార్టీ హస్తినాపురం డివిజన్  అద్వర్యం లో పార్టీ మారిన కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి మళ్ళీ తెరాస  పార్టీ తరపున పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ  ఫ్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపారు .   ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  నిన్న ఆమె ప్రెస్ మీట్ లోని విషయాలు అన్ని అవాస్తవాలు అని ఆరోపించారు .హస్తిసనాపురం కార్పొరేటర్ గా బిజెపి  కండువాపై గెలిచి తెరాస  లకు పోయిన సుజాత నాయక్ దమ్ము ధైర్యం ఉంటే టీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు  .   మొన్నటి జీహెచ్ఎంసీ   ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు పై మీరు గెలిచింది నిజం కాదా అని ప్రశ్నించారు . కార్యకర్తలు డివిజన్ గడప, గడప కు తిరిగి వారి భుజస్కంధాలపై బాధ్యతను ఎత్తుకొని గెలిపించిన విషయం మరిచార గుర్తు చేశారు .మీపై అధికార తెరాస  పార్టీ ఎమ్మెల్యే, వారి అనుచరులు మహిళా కార్పొరేటర్, గిరిజన బిడ్డ అనికూడా చూడకుండా దాడి చేసి అవమాన పరిస్తే ఆరోజు మీకు రక్షణ కవచంగా నిలిచింది ఎవరని అప్పుడు మీకు అండగా ఉన్నది ఎవరని ఆ విషయాన్ని   మరచిపోయి బిజెపి పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని  ఆరోపించడం ఎంతవరకూ సబబని అన్నారు.   మీ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అప్పటి మీ (మా) బిజెపి   సహచర కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులన్నీ మీ వెంట నడిచిన రోజును మరిచారా….?  ఎప్పుడైనా ప్రక్క డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి  ఈ డివిజన్ లోకి వచ్చి మిమ్మలిని ఏవిధంగా ఇబ్బంది పెట్టినారని…., మా జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి  మిమ్మలిని ఒక సోదరి మాదిరిగా చూసుకున్నారని…, మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  మీకు పార్టీ లో సముచిత గౌరవం ఇచ్చినారని..అన్నారు  కానీ ఈరోజు మీరు మీ స్వార్ధ పూరిత బుద్ధితో,  వ్యక్తిగత అవసరాలకో, డివిజన్ అభివృద్ధి అని చెప్పొ పార్టీ మారడం ప్రజలు గమనిస్తున్నారు.  మీరు ఏ పార్టీలోకి వెళ్ళిన భారతీయ జనతా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా కమలం పువ్వుపై గెలిచారు అన్న చరిత్రను ఎవరూ మార్చలేరు….
 మా బిజెపి  కార్పొరేటర్ పై అనవసర నిందలు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు  . భారతీయ జనతా పార్టీ తరపున ఏకైక  డిమాండ్ మీరు మీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి తెరాస  పార్టీ తరపున పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు  .ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మామిడి శాంతిదేవ్ మిత్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు జగన్మోహన్ రెడ్డి, రాజు గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు భిరం అమరేందర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, డివిజన్ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, సోమిరెడ్డి, అమర్నాధ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఓబీసీ  మోర్చా అధ్యక్షుడు రాధాకృష్ణ, బుగ్గ రాములు మహిళా నాయకులు శిరీష, సత్యవతి నాయక్, బీజేవైఎం   నాయకులు రాఘవ, మల్లేష్ యాదవ్, కోట్ల శివ, బలరాజ్  పార్టీ  సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి, శేఖర్ గౌడ్, గోవర్ధన్ నాయక్, ఊర భాస్కర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..