రంగారెడ్డి : ప్రముఖ బాలీవుడ్ హీరో గోవిందా పేరుతో ఘరానా మోసం జరిగింది. ఇండియన్ మోడల్ హంట్ పేరిట బాలీవుడ్ హీరో గోవిందా పేరుతో కొందరు వ్యక్తులు కలిసి రూ.10కోట్లు వసూలు చేశారు. మద్దుల శ్రీనివాస్, పేరాల శ్రీనివాస్, రామారావు తదితరులు తమను మోసగించారంటూ హెచ్‌ఆర్సీలో బాధితులు ఫిర్యాదు చేశారు. జూన్ 1లోగా నివేదిక ఇవ్వాలంటూ విజయవాడ ఎస్పీకి హెచ్‌ఆర్సీ ఆదేశించింది.




