Tuesday, 3 November 2026

బాలుడిని అపహరించిన మహిళలు

హైదరాబాద్‌: భరత్‌నగర్‌కు చెందిన జుల్ఫికర్‌ ఆలీభుట్టో కుమార్తె రెండేళ్ల సుస్రత్‌ ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు మహిళలు అపహరించుకెళ్లారు. ఉప్పల్‌లో వీరు ఉంటున్న ఇంటి ముందు కల్లు తాగేందుకు వచ్చిన మహిళలు చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. వీరి ఇంటి పక్కనే రాజకీయ నేత ఇల్లు ఉండటంతో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలించగా పరిశీలించగా అందులో మహిళలు  చిన్నారిని ఎత్తుకుపోయే దృశ్యాలు ఉన్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *