బాల బాలికలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం

 ఎస్సై విజయలక్ష్మి
 జనంసాక్షి (జులై  14)  బాలబాలికలను   పనిలో పెట్టుకోవడం చట్టరిత్య నేరమని ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి అన్నారు. గురువారం బాల కార్మికుల నియంత్రణ అధికారుల   ఆధ్వర్యంలో   స్థానికంగా ఉన్న  మూడు మెకానిక్ షాపుల  లో పనిచేసే బాల కార్మికులను  దాడి చేసి పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఎస్సై విజయలక్ష్మి  బాల కార్మికుల తల్లిదండ్రులను పిలిపించి  కౌన్సెలింగ్ ఇచ్చారు.  బాలలను   పనిలో పెట్టుకున్న  షాపు యజమానులపై కేసు నమోదు చేశామని   తెలిపారు. మైనర్లను  పనిలో పెట్టుకుంటే   సహించేది లేదని హెచ్చరించారు.