Wednesday, 4 November 2026

బాసరలో భక్తునికి తిప్పలు.

..

మొదట రూమ్ బుక్ అని చూపిస్తారు.తీరా వచ్చేసరికి లేదంటారు.

భైంసా రూరల్ జనవరి 25 జనం సాక్షి

రేపటి వసంత పంచమి వేడుకలకి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల సైతం నుంచి భక్తులు అక్షరాభ్యాసము,దర్శన నిమిత్తము వస్తుంటారు. అయితే వసంత పంచమి వేడుకలకు సంబంధించి జనాన్ని దృష్టిలో ఉంచుకొని పలువురు భక్తులు ముందే రూమ్స్ బుక్ చేసుకొని ఏర్పాట్లు చేసుకుంటారు. బాసర నుండి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకులం జిల్లాకు చెందిన ఓ భక్తుడు గత డిసెంబర్లో అమ్మవారి సన్నిధిలో గల రూమును బుక్ చేసుకోగా… తీర వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇప్పుడు బాసర వచ్చిన భక్తునికి మీకు రూము లేదని సంబంధిత అధికారులు తెలపడంతో భక్తుడు ఇబ్బంది పడుతున్నారు.గత రెండు నెలల క్రితమే రూములు బుక్ చేసుకున్న పలువురి భక్తులకి మీ రూమ్ లు క్యాన్సల్ అంటూ అమౌంట్ కూడా వారి ఖాతాకి రిటర్న్ చేసామని సిబ్బంది తెలపడం గమన్హారం. అయితే చాలామంది భక్తులకి ఇలానే రూములు క్యాన్సిల్ అయ్యాయి. వారి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయి. క్యాన్సిల్ అయ్యి డబ్బులు జమ అయిన భక్తుల పరిస్థితి ఓకే.కానీ శ్రీకాకుళంకు చెందిన భక్తునికి మీకు రూము లేదని అమౌంట్ కూడా సెండ్ చేశామని ఇబ్బంది తెలపగా మరల ఆన్లైన్ లో ఒకసారి చూసుకోగా భక్తునికి చేరవలసిన రిటర్న్ అమౌంట్ కూడా చేరలేదు. సమయానికి ఇప్పుడు రూము లేదు. దీంతో వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన భక్తునిఫ్యామిలీకి ఇబ్బంది కలిగించడం ఘోరమని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.