బిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి, మంత్రి కొప్పుల..

మంత్రి సమక్షంలో కాంగ్రెస్, బిజెపిలకు చెందిన 60 మంది యువత బిఆర్ఎస్ లో చేరిక

ధర్మపురి(జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామం నుండి అల్లే అరవింద్, సుద్దాల వెంకటేష్ సెల్స్ మండల ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో 60 మంది యువకులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు,తదనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోతున్నాయని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టి అన్ని తెలంగాణను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిస్తున్న కెసిఆర్ మహోన్నత నాయకులు అని ఆయన కొనియాడారు.
బిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని, కాంగ్రెస్,బిజెపిలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయని, కెసిఆర్ సుపరిపాలనకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని వివరించారు.యువతకు మంత్రి గులాబీ కండువాలు కప్పి బిఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పిటిసి బత్తిని అరుణ, మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ అక్కెనపల్లి సునీల్ కుమార్, తదితర టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.