ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్..
ధర్మపురి( జనం సాక్షి)మండలానికి 5 లక్షల 77 వేల 500 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 21మంది లబ్ధిదారులకు చెక్కులను ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, తో కలిసి చెక్కులను పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,వివిధ కారణాల వల్ల అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్నటువంటి లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని,దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది పేదలకు నాణ్యమైన వైద్యమందించి ఆదుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పాలిట ఆపద్బాంధవుడు అని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సంగి సత్తేమ్మ, జెడ్పీటీసీలు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్, యంపిపి చిట్టిబాబు, చైర్మన్ అయ్యోరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.