బిఆర్ఎస్ పార్టీతోనే బంగారు తెలంగాణ : మంత్రి మల్లారెడ్డి
శామీర్ పేట్, జనంసాక్షి : బి ఆర్ ఎస్ పార్టీ అభివృద్ధి చూసి పార్టీలో అందరు చేరుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకలకు, మేడ్చల్ నియోజకవర్గంలో శామీర్ పేట్ మండలంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఆకర్షితులై శామీర్ పేట్ మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి బి ఆర్ఎస్ పార్టీలో చేరారు . ప్రభాకర్ రెడ్డితో పాటు నర్సింహా, దేవేందర్, రాజేష్, అనిల్ కుమార్, బిక్షపతి, విష్ణు, రామస్వామి మరియు భారీ ఎత్తున్న మహిళాలు, యువకులు 100 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు .వారందరికీ మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు .సర్పంచ్ గుర్కా కుమార్ ఆధ్వర్యంలోఅంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు .సర్పంచ్, ఉప సర్పంచ్,గ్రామస్తులు గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్,డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏ ఎం సి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,జడ్పీటీసీ అనిత, మండల రైతు బందు అధ్యక్షులు కృష్ణ రెడ్డి,స్థానిక ఎంపీటీసీలు కోడూరి అశోక్, శ్రీనివాస్ యాదవ్,స్థానిక సర్పంచ్ గుర్క కుమార్,పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.