బిచ్కుంద జనవరి 31 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో దౌల్తాపూర్ రోడ్ లో గల అన్నదమ్ముల చెరువు వద్ద చెరువు నీటిలో గుర్తు తెలియని మృతదేహం మంగళవారం నాడు మద్యాహ్నం కనబడిందని బిచ్కుంద ఎస్సై తెలిపారు. ఎవరైనా ఇట్టి వ్యక్తిని గుర్తించినచో ఎస్సై చరవాణి నంబర్ 9440794456 కు ఫోన్ చేసి సమాచారం తెలుపగలరని పేర్కొన్నారు.




