బిచ్కుంద (జనంసాక్షి) జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబి పాటిల్ మరియు జుక్కల్ తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మండలకేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయ ఆవరణలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలను, పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసేందుకు జుక్కల్ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మరియు జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బీబి పాటిల్ ఇద్దరూ బిచ్కుంద మండలానికి వచ్చారు. నాయకులతో, కార్యకర్తలతో, ప్రజలతో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వీరు బిచ్కుందకు రావడంతో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వారిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఒక్కోక్కరికి కరచాలనం చేసి, ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా బంగారం (జంబి ఆకు) పెట్టి అలయ్ బలాయ్ తీసుకున్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో బిచ్కుంద మరియు పెద్ద కొడప్గల్ ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీహరిరాజు, రాజుల్లా అశోక్ పటేల్, జాగృతి మండల కన్వీనర్ ఎన్నెమ్ బాల్రాజ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బస్వరాజు పటేల్, హాజీ లక్ష్మణ్, షేక్ లడ్డూ మియ, బొమ్మల్ లక్ష్మణ్, రాజు పటేల్, భీంపటేల్, మాధవరావు దేశయ్ మరియు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.




