ఆర్య వైశ్య ఫెడరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక కృతజ్ఞతలు
మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి
తాండూరు అక్టోబర్19( జనం సాక్షి ) రాష్ట్రంలోనే తొలిసారి
ఆర్య వైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేయడం పట్ల సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మంటపం సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు .అంతకుముందు కళ్యాణ మండపంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి కోట్రీక విజయలక్ష్మి మాట్లాడుతూ టిఆర్ఎస్ మేనిఫెస్టోలో రెడ్డి సామాజికవర్గం తోపాటు ఆర్య వైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పై వారు సంతోషం వ్యక్తం చేశారు. సమాజ సేవలో ముందుండి అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు .ఆర్యవైశ్య సంఘంలో కూడా పేదవారు ఉన్నారని, అలాంటి వారికోసం ఫెడరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు .ఆర్యవైశ్యులను గుర్తించి ఫెడరేషన్ ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అల్లంపల్లి సిద్ధం మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ ,కార్యదర్శి శివకుమార్ వాసవి క్లబ్ అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ ,కల్వ రవి, శ్రీధర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.




