Wednesday, 4 November 2026

బిచ్కుందలో నేడు సర్వసభ్య సమావేశం 

ఎంపీడీవో సాయిబాబా
జనంసాక్షి (బిచ్కుంద) నేడు ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని బిచ్కుంద మరియు పెద్ద కొడప్గల్ ఉమ్మడి మండలాల ఎంపీడీవో సాయిబాబా అన్నారు. సర్వసభ్య సమావేశం ఎంపీపీ లలితా అశోక్ పటేల్ అధ్వర్యంలో జరుగుతుందని, ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బీబి పాటిల్, నిజామాబాద్ మరియు కామారెడ్డి ఉమ్మడి జిల్లాల జడ్పీ ఛైర్మన్ దఫేదార్ రాజు హాజరవుతారని పేర్కొన్నారు. మండల అధికారులు, ఎంపీటీసీలు తమ నివేదికలతో సకాలంలో హాజరు కావాలని సూచించారు.