బిచ్కుంద మే 18 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రానికి చెందిన లక్ష్మణ్ కు గురువారం నాడు మండలకేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసినారు. ఈ సందర్భంగా నాల్చర్ రాజు మాట్లాడుతూ
నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, డాక్టర్ రాజు తదితరులు ఉన్నారు.




