*బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు*

మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 17 :
(జనం సాక్షి)
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని మెట్ పల్లి పట్టణంలోని 4వ వార్డు సాయిరామ్ కాలనీ లో పట్టణ అధ్త్యక్షులు బోడ్ల రమేష్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాల మధ్యన కేక్ కట్ చేసి నిరుపేద మహిళలకు చీరలు ,పేద పిల్లలకు పుస్తకాలు పెన్నులు బిస్కట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సంధర్బంగా బోడ్ల రమేష్ , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబార్ ప్రభాకర్ మాట్లాడుతూ విశ్వగురువుగా భారత దేశానికి పునర్ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో 140 కోట్ల భారతీయుల ఉన్నతికై కంకణం కట్టుకొని పేదరికం , అవినీతి ,ఉగ్రవాదం వంటి పీడల విముక్తి నుండి నవ భారత నిర్మాణానికి కృషిచేస్తున్నటువంటి నరేంద్రమోడీ ని బలపర్చవల్సిందిగా విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభకర్ గారు, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికేల నవీన్ , గుంటుక సదాశివం పార్లమెంట్ కో కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి బాబు, జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షులు మన్నే గంగాధర్, బోడ్ల నగేష్, జిల్లా బీజేవైయం ఉప అధ్యక్షులు సుంకేట విజయ్, జిల్లా బీజేవైయం అధికార ప్రతినిధి బోడ్ల నరేష్, మిట్టపల్లి సాయి, బిజెపి సీనియర్ నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి, కొల్లెపు శ్రీనివాస్. పాపర్టీ ఆనంద్ జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ యాదవ్, పట్టణ బీజేవైయం పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్, బీజేవైఎం జిల్లా నాయకులు. బోడ్ల గౌతం. బండారు రమేష్, బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షుడు కుడుకల రఘు, బీజేవైఎం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శికలికోట శ్రీకాంత్ బీజేవైఎం కార్యదర్శి మిట్టపల్లి శివ ఐటీ సెల్ నవీన్ వివేక్ రాజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.