బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం

వేములవాడ రూరల్, సెప్టెంబర్ 17 (జనం సాక్షి) : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బిజెపి గ్రామీణ కార్యాలయంలో అధ్యక్షుడు జక్కుల తిరుపతి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా తెలంగాణలో బానిస బతుకులు తొలిగిపోయాయని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్, చెట్టిపల్లి రవి కిషోర్, మల్లికార్జున్, అంజని కుమార్, వెంకటేష్, మల్లారం తిరుపతి, అశోక్, రమేష్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు