బిజెపి ఆధ్వర్యంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ..
అనంతగిరి,జనం సాక్షి,:
మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ 106వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఏలేటి వెంకటరెడ్డి మాట్లాడుతూ… జన సంఘ వ్యవస్థాపకులు శ్రీ పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ తన జీవితాన్ని పార్టీ కోసం దేశం కోసం అంకితం చేశారన్నారు. వారి యొక్క ఆశయాలను,భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి బిజెపి వైపు ప్రజలు ఆకర్షించే విధంగా తెలంగాణలో బిజెపి అధికారంలో వచ్చే విధంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా తమ వంతు కృషి చేయాలని గుర్తు చేశారు .ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి చింత కుంట్ల సతీష్, ఉపాధ్యక్షులు సిద్ధయ్య , ఒ బి సి మండల అధ్యక్షుడు కాకని వెంకటేశ్వర్లు,మైసయ్య తదితరులు పాల్గొన్నారు