బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి-రవిగౌడ్
నల్గొండటౌన్, నవంబర్ 15(జనంసాక్షి)
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పై దాడి చేశారని సమాజంలో ఇలాంటి దాడులు చేయడం హేయనైన చర్య అని తక్షణమే దాడి చేసిన వారిని, వారి వెనకాల ఉండి దాడులకు ఉసిగొలుపుతున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి కు మరింత భద్రత కట్టుదిట్టం చేయాలని నల్లగొండ బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవిగౌడ్ మీడియా ద్వారా ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు