Tuesday, 3 November 2026

*బిజెపి నాయకులను విమర్శించే అర్హత టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేద

మెట్పల్లిటౌన్ : ఆగస్టు20
(జనంసాక్షి)
బిజెపి నాయకులను విమర్శించే అర్హత టిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్ అన్నారు. బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్‌తో కలిసి మెట్ పల్లి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల తరహాలో కోరుట్ల నియోజకవర్గంలో అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ మాట్లాడుతూ మెట్‌పల్లి ఖాదీ బోర్డులో అవకతవకలపై ఎమ్మెల్యే కేంద్ర విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, బిజెపి ఐటీ సెల్ జోనల్ ఇంచార్జ్ మిట్టపెల్లి సాయికుమార్, బిజెవైయం జిల్లా అధికార ప్రతినిధి బొడ్ల నరేష్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడు రమేష్, బిజెవైయం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్, పట్టణ ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు కుడుకల రఘు తదితరులు పాల్గొన్నారు