బిజెపి నాయకులు అరెస్టు..
టేక్మాల్ జనం సాక్షి ఆగస్టు 23 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా టేక్మాల్ మండల బిజెపి నాయకులను బుధవారం ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిజెపి మెదక్ జిల్లా కార్యదర్శి శ్యామయ్య మాట్లాడుతూ కెసిఆర్ మెదక్ పర్యటనలో భాగంగా బిజెపి నాయకులు అరెస్ట్ చేయడం అమానుషం అన్నారు. ఓటమి భయంతోనే 9 సంవత్సరాల నుండి అమలు చేయని పథకాలను ఒక్క నెల రోజుల్లో అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పొలీస్ స్టేషన్లో నిర్బంధించడం బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తుందన్నారు. అరెస్ట్ అయిన వారు మెదక్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు రెడ్యానాయక్, ఎల్లుపేట రాజు, కుమ్మరి సిద్ధిరాములు, నాగరాజు, తదితరులు ఉన్నారు.