Thursday, 5 November 2026

బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి- కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

*బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి- కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : రాష్ట్రంలో బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ తో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కు రాష్ట్ర బీజేవైఎం ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్ యాదవ్ ఘనంగా శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని ప్రజలలో బిజెపి పట్ల ఆదరణ పెరగడంతో టిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి,బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్రమంత్రికి స్వాగతం పలుకుతున్న బిజెపి నాయకులు.