Wednesday, 4 November 2026

బిజెపి పార్టీ సంయుక్త మోర్చా సమ్మేళనం లో పాల్గొన్న నాయుడు ప్రకాష్

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 15 బోయినపల్లి భారతీయ జనతా పార్టీ సంయుక్త మోర్చాల సమ్మేళనo కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎస్సీ మోర్చా,ఓ బి సి మోర్చా,మహిళా మోర్చా, యువ మోర్చా పార్టీ సంయుక్త సమ్మేళన సమావేశం బిజెపి సీనియర్ నాయకులు కంటోన్మెంట్ కాంట్టెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండేట్ నాయుడు ప్రకాష్ ఆధ్వర్యంలో క్లాసిక్ గార్డెన్ లో నిన్న సాయంత్రం ఘనంగాజరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహంకాళి జిల్లా బిజెపి అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు జె. రామకృష్ణ,పాల్గొన్నారు. అనంతరం శ్యాంసుందర్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే వారం రోజుల్లో జరగబోయే మహాజన్ సంపర్క అభియాన్ కోసం అన్ని మూర్చాలు కలిసికట్టుగా కృషిచేసి ఇంటి ఇంటికి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ను జనాలకు చేరేటట్టుగా కంటోన్మెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ తెలియజేశారు. నాయుడు ప్రకాష్ మాట్లాడుతూ పార్టీ నాయకులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ నాయకత్వాన్ని బలపరిచి పార్టీ సూచించిన అభ్యర్థికి మద్దతు తెలపాలని పార్టీ నాయకులకు తెలియజేస్తూ,నరేంద్ర మోడీ ఈదేశానికి ఎంతో సేవలు చేస్తున్నారని ప్రపంచంలోనే మన దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారు అన్ని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీని మన నరేంద్ర మోడీ,బిజెపి పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని నాయుడు ప్రకాష్ పార్టీ మోర్చా అధ్యక్షులకు,డివిజన్ ప్రెసిడెంట్ లకు సంయుక్త మోర్చా సమావేశంలో వెల్లడించారు. ఈ సంయుక్త సమావేశంలోమల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ జె.నరసింహరావు,సికింద్రాబాద్ నియోజకవర్గ కన్వీనర్ విజయ్ఆనంద్,నూతనంగాఎన్నికైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుక మల్లికార్జున్, ఆరేపల్లి పరశురాం,జాయింట్ కన్వీనర్ సతీష్,ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎస్.రాజన్న,ప్రధాన కార్యదర్శి జైపాల్ రాకేష్, రాయల్ కుమార్,మన్నె శ్రీనివాస్,రజిని, డాక్టర్ సుష్మా రెడ్డి, విజయరామరాజు,బిజెపి ఒకటో వార్డు అధ్యక్షులు బట్టు శంకర్,ఆరో వార్డు అధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్, బిజెపి నాయకుడు ప్రేమ్ కుమార్ ముదిరాజ్, అశోక్ యాదవ్,నరసింహ,అజిత్ కళ్యాణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.