సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన నంది లక్ష్మి ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫార్సు చేసుకోగా, నంది లక్ష్మి కి 10.000 /- రూ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాగా ఇట్టి సీఎం.ఆర్.ఎఫ్ చెక్కును మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మంథని మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండలశాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును లబ్ధిదారుకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, కమాన్ పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, గుండారం ఉప సర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, గుండారం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దండే కిషన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, గొడిశెల స్వామి, పిడుగు శంకర్, కందుల మధు, మల్యాల భాస్కర్, కీర్తి శ్రీనివాస్, తోట రాజ్ కుమార్, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు