బిజెపి ప్రభుత్వం వస్తే రైతులకు ఉచిత కరెంటు ఉండదు,
మంత్రి హరీష్ రావు
జహీరాబాద్ సెప్టెంబర్ 24( జనంసాక్షి)బీజేపీ ప్రభుత్వం వస్తే ఉచిత కరెంట్ ఉండదు రైతులకు మీటర్లు వస్తయి. కరెంటు బిల్లులు వస్తయి అని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం జహీరాబాద్ నియోజకవర్గంలో ని జహీరాబాద్ మొగుడం పల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం జహీరాబాద్ రైతులకు ఇప్పటివరకు 742 కోట్ల రైతుబంధు రూపంలో రైతులకు అందించింది అన్నారు.పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం బిజెపి ఉంది. ఆ రాష్ట్రంలో 700 రూపాయల పెన్షన్ ఇస్తుంది, రైతులకు ఉచిత కరెంటు లేదు. రైతు బీమా లేదు రైతు బంధు లేదు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లేదు అన్నారు. ఉచితాలు వద్దంటున్నరు. పేదలకు ఇవ్వద్దంట రైతు కు రుణ మఫీ చేయ వద్దంట. రైతుకు రైతు బంధు వద్దంట. రైతుకు ఉచిత బీమా వద్దంట. పేదలకు ఉచిత రేషన్ వద్దంట. పేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు వద్దంట అని బీజేపీ పై విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన విద్యాలయాల సంఖ్య 91 నుండి 183 వరకు పెరిగింది అన్నారు.
గిరిజన విద్యార్థులకు 83 ఇంటర్ స్థాయిలో గురుకులాలు, 22 డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలియజేశారు.తెలంగాణ రాకముందు గురుకులాల మీద 380 కోట్లు ఇప్పుడు 3300 కోట్లు. 10 రెట్లు పెరిగింది అన్నారు.అప్పుడు ఉన్న గురుకులాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, బాలికలవి 298, ఈరోజు 923 ఉన్నాయి. 5 రెట్లు పెరిగాయి అన్నారుస్వరాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలలను కాలేజీలుగా సీఎం అప్ గ్రేడ్ చేశారు అన్నారు.ఈ ఘనత మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కు దక్కుతుంది అన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కోటీగా పరిష్కరించుకుంటూ అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం అన్నారు.ఏ గణాంకాల్లో అయినా తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపినం. తలసరి ఆదాయంలో, ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ వన్. ఆరోగ్య రంగంలో నెంబర్ వన్ దిశగా సాగుతున్నం అన్నారు.తాగు, సాగు నీరు ఇవ్వడంలో నెంబర్ వన్. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దశ- దిశ చూపుతోంది అని పేర్కొన్నారు.ఇది బీజేపీకి కన్ను కుట్టినట్లవుతోంది అన్నారు. తెలంగాణ వ్యవసాయక రాష్ట్రం. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగిన ప్రాంతం. ఇవాళ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మార్చాం అన్నారు.బోర్ల దగ్గర, బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ముక్కు పిండి కరెంటు చార్జీలు వసూలుచేయాలంట. చార్ఝీలు వసూలు చేస్తేనే రాష్ట్రానికి అప్పులు ఇస్తమంటున్నరు ఇది ఎంత వరకు సమంజసం అన్నారు.కరెంటు మీటర్లు పెట్టాలా వద్దా మీరే చెప్పండి అంటూ ప్రజలకు అడిగారు.గిరిజన విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురి ని ఆకట్టుకున్నాయి. మంత్రి అడిగిన క్విజ్ పోటీలో గెలిచిన రాద అనే విద్యార్థి కి మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ, ఆత్మ కమిటీ చైర్మన్ లు ఉమాకాంత్ పాటిల్ పెంటరెడ్డి,జిల్లా కలెక్టర్ శరత్, జడ్పిటిసి అరుణ మోహన్ రెడ్డి, సర్పంచ్ సుగుణమ్మ, నాయకులు కుత్బొద్దిన్, నామ రవికిరణ్, రామకృష్ణ బాబీ, తిమోతి,ఈశ్వర్ రెడ్డి, సజ్జపూర్ తండా సర్పంచ్ శంకర్ నాయక్,అధికారులు సర్పంచ్ ఎంపిటిసి లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|