స్కూల్ అటెండర్ కు ఆర్ధిక సాయం
జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండలం లోని పోతారం జిల్లా పరిషత్ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న తలరి లింగం అనే వ్యక్తి కి శ్రీ లొంక రామేశ్వర దుబాయి సంఘo నుండి 20,000 వేయిల రూపాయల ఆర్థిక సహాయాన్ని సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ అటెండర్ కు కాలు సర్జరి కావడంతో ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులు విషయం తెలుసుకొని ఆర్థిక సాయం అందించాలని దుబాయ్ లో పనిచేసే సభ్యులు అందరూ కలిసి సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు,దూబయ్ సంఘసభ్యులు తదితరులు పాల్గొన్నారు.