బిజెపి రాష్ట్ర నాయకులు సునీల్ రెడ్డి పరామర్శ

జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటనరికాలనీ కి చెందిన సింగరేణి కార్మికుడు బూర్ల సారయ్య ఇటీవల సింగరేణి గని ప్రమాదంలో మృతి చెందిగా వారి కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్ర నాయకులు చంద్ర పట్ల సునీల్ రెడ్డి గురువారం పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట బీజేపీ ఐటి, సోషల్ మీడియా మంథని అసెంబ్లీ కో- కన్వీనర్ తొట్ల రాజు, సీనియర్ నాయకులు పెద్దుల్ల ఐల్లయ్య శ్రీమల్ల తిరుమలు, కుంట చక్రి, మెరుగు శ్రీకాంత్, కందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు