ఆత్మకూర్(ఎం) ఆగస్టు 10 (జనంసాక్షి) పల్లెర్ల శ్రీకృష్ణ యాదవ ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షులుగా మంటిపెల్లి వెంకటేష్ యాదవ్ ఎన్నికైయ్యారు ఉపాధ్యక్షులుగా బండి ఐలయ్య యాదవ్ కార్యదర్శిగా కన్నబోయిన మహేష్ యాదవ్ ఓటింగ్ ద్వార మెజారిటీతో గెలవడం జరిగింది ఈ సందర్బంగా ఎన్నికైనవారు మాట్లాడుతూ యాదవ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని యాదవ సోదరులందరికీ అందుబాటులో ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వారిలో ఒక కుటుంబ సభ్యులుగా వారి సమస్యలను మా సమస్యలుగా భావించి ఎల్లవేళలా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు మా ఎన్నికకు సహకరించిన యాదవ సంఘం బంధువులు కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుణవేణి సైదులు యాదవ్ మచ్చగిరి యాదవ్ రవి కుమార్ యాదవ్ నాగరాజు యాదవ్ మధు యాదవ్ శ్రీశైలం యాదవ్ మల్లేష్ యాదవ్ యాదిమల్లు యాదవ్ శ్రీశైలం యాదవ్ మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు
యాదవ సంఘం నూతన అధ్యక్షులుగా మంటిపెల్లి వెంకటేష్ యాదవ్ ఎన్నిక




