Wednesday, 4 November 2026

బిజేపీ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలుస్తారు :కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )బిజేపీ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలుస్తారని  కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  . మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఘనవిజయం సాధించాలని సోమవారం  వేసిన నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి ,బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు , కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ,హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ రెడ్డి  పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి గారు వారిని కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శంకరయ్య గౌడ్, పవన్ రెడ్డి, కిషోర్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.